అనంత పద్మనాభ వ్రతము

చతుర్ధశ భువనాలు పాలించెడి శ్రీ మహావిష్ణువు సహిత శ్రీ మహాయోగేశ్వరీ దేవి యొక్క పూర్ణిమ పూర్ణాహుతి మహా యజ్ఞము మరియు వ్రతము.
పౌర్ణమి ధ్యానము

రోగ నివారణ కోసము చేసే సామూహిక పౌర్ణమి ధ్యానము.
శివ ధ్యానముు
మహాలక్ష్మీ సాధన -1

మహాలక్ష్మీ సాధన -2


ఋషి కల్ప సాధనా అస్త్రవిద్యా శిబిరము

మహాభారత కాలము నాటి బ్రహ్మాస్త్ర ప్రయోగము గురించి చెబుతూ మళ్ళి 2000 ఏ.డి సమయమందు పృథ్వి గ్రహానికి సంబవించబోయే పెను ముప్పును నివారించడానికి సప్తఋషులు జులై 4 వ్ తేదీన భూమి మీదికి దిగుతారని ఓకే ప్రిడిక్షన్ మన పురాణాలలో ఇవ్వబడినదని శ్రీ రామకృష్ణ గురుదేవులు తెలియజేశారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గ్రామము నందు 21 రోజుల పాటు అస్త్రవిద్యా ప్రయోగ శిబిరాన్ని నిర్వహించారు. అక్కడి కార్యకర్తలు చేసిన విస్తృత ప్రచారమునకి ఆకర్షితులైన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు బండ్ల మీద అమలాపురం గ్రామానికి వచ్చి శ్రీ గురుదేవులు నిర్వహిస్తున్న శిబిరంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయ వంతము చేయటము జరిగింది. ఆనాటి 21 రోజుల ఉపన్యాసాల క్యాసెట్లు పూర్తిగా లభ్యము కానప్పటికీ, కొన్ని క్యాసెట్లు ఇందులో పెట్టటము జరిగింది.

• అమలాపురం ఉపన్యాసము
3-5-94 వ తేదీన అశ్వమేధానికి దేవసంస్కృతికి వుండే సంబంధాన్ని ఇందులో చెప్పటము జరిగింది.


• అశ్వమేధము

9-5-94 వ తేదీన మనలోని 14 నాడులు మరియు మూడు శ్వాసల ద్వారా ఏ విధంగా అంతరిక్షంలోని త్రిశంకు స్వర్గానికి సంబంధం వున్నదో వివరించారు.










అస్త్ర విద్య దీక్ష-1

పతంజలి యోగ సూత్రాలలోని తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానములతో కలుపుతూ సుపర్ణ సూక్తములోని ''ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అది విశ్వే నిషేదుః యస్తన్న వేదా: కిం రుచా కరిష్యతి సాయిమే సమాసతే", అనెడి శ్లోకాన్ని ఓంకార దీక్షకు సంబంధించి మొదటి సారిగా ఈరోజున 4-7-99 న ఇవ్వటం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యతను ఈ రెండు ఉపన్యాసాలలో వినగలరు.
అస్త్ర విద్య దీక్ష-2

పతంజలి యోగ సూత్రాలలోని తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానములతో కలుపుతూ సుపర్ణ సూక్తములోని ''ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అది విశ్వే నిషేదుః యస్తన్న వేదా: కిం రుచా కరిష్యతి సాయిమే సమాసతే", అనెడి శ్లోకాన్ని ఓంకార దీక్షకు సంబంధించి మొదటి సారిగా ఈరోజున 4-7-99 న ఇవ్వటం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యతను ఈ రెండు ఉపన్యాసాలలో వినగలరు.
యూనివర్సిటీ ఆఫ్ సిరీస్

సిరీస్ నుండి వస్తున్న కిరణాలు మన షట్చక్రాలలో ఏ విధంగా అక్షరమాలగా రూపొంది మన 5 జ్ఞానేంద్రియ్ర, 5 కర్మేంద్రియాల ద్వారా పని చేస్తుంటాయో అన్న వివరణను శ్రీ రామకృష్ణ గురుదేవులు 4-11-99 తేదీన తమ ఆశ్రమము నందు ఈ ఉపన్యాసము ద్వారా శిష్యులకు అందించారు.
బుధ గ్రహము మీద యాత్ర

మన మనోమయ కోశము ద్వారా చేయబడే అంతరిక్ష యాత్ర కి కావాల్సిన సాధనని తిధి వార నక్షత్రాలతో కలిసిన తారాశశాంకము కధతో ఇందులో చెప్పటము జరిగింది (ఆఙ్ఞా చక్ర జాగరణ).
ఓం కారము యొక్క రహస్యమైన వివరణ

800 కోట్ల మానవజాతిని నిర్ణయించే రోజలు 96,97,98 సంవత్సరాలు. ఇప్పుడు మన కర్తవ్యము ఏమిటి.. దేశకాల పరిస్థితులకి అతీతముగా సర్వజనీనమైనటు వంటి సత్యాల గురించి చెప్పారు. మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు వున్నాయి. ఇవి మనలో 6 చక్రాల ద్వారా మనలో ప్రవేశించి పని చేస్తూ ఉంటాయి. ఈ ప్రపంచము మనసు అనేటటువంటి ఆజ్ఞ చక్రము ద్వారా మనందరిలో పని చేస్తుంది. దీని తెలుసుకున్నాక జాగ్రద నుంచి స్వప్నకి, స్వప్న నుంచి సుషుమ్న జగత్తులకి వెలాలి ఏ సాధనాలు చేసిన కూడా ఈ విధంగా వెలాల్సిందే. ఓంకార ధ్యానము ఎలా చెయాలో ఈ ఉపన్యాసము లో చెప్పబడింది. విశుద్ధి వరుకు శ్వాస ఎలా వెళ్తుంది అనేది ధ్యానం చేయాలి. దివ్య స్పర్శ, దివ్య శ్రవణం, దివ్య దర్శనం, దివ్య రుచి, దివ్య గంధములు మానవ జాతి మొత్తం ఎలా పొందాలి. 5 రకాలుగా పని చేస్తుంది వాయువు. మనము పీల్చిన గాలి ఆకాశ తత్వముగా మారి ఆ తర్వాత మన ఊపిరిగా మారుతుంది.
సూర్య ధ్యానము

సూర్యుని నుంచి వచ్చే కిరణాలు మన పై ఎలా ప్రభావం చూపిస్తాయి. వాటిని మనము ధ్యానములో ఏ విధముగా ఉపయోగించుకొని మన శరీరమును మరియు మనసును కరెక్ట్ చేసుకోవచునో వివరింప బడింది.
ఓంకార సాధన

మన నాసికాగ్రము అంటే రెండు కనుబొమ్మల మధ్య స్థానము నుంచి శ్వాస ఒక విచిత్రమైన మార్గములో ముందుగా వెన్నుపూస లోకి వెళ్ళాలి. కంఠము వద్ద నుండే విశుద్ధి చక్రము దగ్గరికి ఏ మార్గము ద్వారా శ్వాస వస్తున్నదో తెలుసుకోవాలి. ఊపిరి తిత్తులలోకి వెళుతున్న మార్గాన్ని దక్షిణాయనము అంటారు.(ఇది వాయువు క్రిందికి దిగుతున్న మార్గము). మరొక మార్గము ద్వారా శ్వాస పైకి విశుద్ధి చక్రము వైపుగా వస్తున్నది. దీనిని దక్షిణాయనము అంటారు. నాసికాగ్రము నుండి లోపలి వెళ్లిన శ్వాస వెన్నుపూస మీద కంఠము దగ్గర వున్నా విశుద్ధి చక్రము లోకి ఏ మార్గములో వెళుతుంది అన్నది తెలుసుకోవాలి. (శ్రీ చక్రములో వున్న నలబై మూడు కోణాలు మన శరీరములో ఈ చంద్ర నాడి ద్వారా పని చేసే మార్గములే). స్పర్శ ద్వారా ఆ మార్గము డీప్ స్లో బ్రీతింగ్ ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు పట్టుకోగలరు. ఈ సాధనను అనేక మంది ఋషులు చేశారు. దీనినే షోడశ దళ పద్మము లేక శ్రీం బీజమంటారు. శ్వాస ఈ విధముగా మన కంఠము లోకి వెళ్లగలిగితేనే మాట్లాడగలరు. వాక్ శక్తి కేంద్రమిది. ప్రతి మనిషి ఈ విధమైన శ్వాసను పీలుస్తూనే వుంటాడు.
వ్యాహృతుల సాధన

ఓంకారము లోని మూడు అక్షరాలు అ, ఉ, మ లు గాయత్రీ మంత్రములోని భూర్ భువః స్వ: లుగా భౌతిక జగత్తులో మారుతాయి. ఎరుపు, పసుపు, నీలము, ఈ రంగులకు సంభందించిన దాన్ని వర్ణ సాధన లేక వ్యాహృతుల సాధన అంటారు. దీనికి సంబందించిన సాధనాత్మక వివరణ.
పంచకోశ జాగరణ

పంచకోశ సాధన లో ఆకాశములో వుండే నక్షత్ర మండలములోకి వెళ్లగలగాలి. పూర్వపు ఋషులు నక్షత్ర మండలము లోకి వెళ్లాలంటే ఈనాడు వున్న స్పుత్నిక్, రాకెట్స్ అవసరము లేకుండానే ఆకాశము లోకి వెళ్లగలిగేవారు. ఆనందమయ కోశములోకి ప్రవేశించగలిగిన వారు ఎక్కడికైనా వెళ్లవచ్చును. ఈ పంచకోశ సాధన ద్వారా సాధకులకు సర్వజ్ఞత్వ, సర్వ వ్యాపకత్వ, సర్వ సమర్ధతలు అనెడి భగవంతుని మూడు శక్తులు లభిస్తాయి. ఈ సాధనలో మనలో శ్వాస ఐదు భాగాలుగా మారుతుంది.
సహజ ప్రాణాయామము
పంచ సూక్తాల వివరణ

అశ్విని సూక్తము, అగ్ని సూక్తము, పురుష సూక్తము, అలవాట్లు మార్చుకునే విద్య. పురుష సూక్తము 27 నక్షత్రాలు గురించి చెప్తుంది. శ్రీ సూక్తము తిధుల గురించి సుపర్ణ సూక్తము చెప్తుంది. ఈ ఐదు సూక్తాలను కలిపి పంచాంగము అంటాము.
శ్రీనివాస విద్య

ఆదిత్య హృదయము

ఆదిత్య హృదయము అంటే "ది సోల్ ఆఫ్ ది సన్". ఆ సూర్యుడి యొక్క ఆత్మ. సవితా శక్తిని కూడా సూర్యుడి యొక్క ఆత్మగానే చెబుతారు. గాయత్రీ మంత్రములోని తత్సవితుర్వరేణ్యం అనే పదము కూడా సూర్యుడిని చెబుతుంది. అగస్త్యుడు సనాతనమైన ఈ యోగవిద్యను అందించారు. ప్రతి ఒక్కరిలో అంతర్ యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఈ ఆదిత్య హృదయమును అర్ధము చేసుకొని ఆచరించటము ద్వారా ప్రతి ఒక్కరు తమలో జరిగే యుద్ధములోని శత్రువులని జయించగలుగుతారు. తద్వారా నూతన యుగము ఆవిర్భవిస్తుంది.